అవ్వా అదరగొట్టావ్.. కంకులు కాల్చేందుకు సోలార్ ఫ్యాన్

Selvamma
Selvamma (batukamma.com)

ఈమె పేరు సెల్వమ్మ. వయసు 75 ఏళ్లు.  కర్ణాటక రాష్ట్రం ఈమెది  బెంగళూరు విధాన్ సౌధ ముందు మొక్కజొన్న కంకులు కాల్చుకుంటూ బతుకుతుంది. 20 ఏళ్లుగా ఈమెకు ఇదే జీవనాధారం. ఇటీవలే ఈమె సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకు కారణం ఆమె కంకుల బండిపైన ఉన్న సోలార్ ప్యానెల్…దాంతో నడిచే బ్యాటరీ ఫ్యాన్.. లైట్.

సోలార్ ఫ్యాన్ పెట్టుకుని.. కంకులు కాల్చుకుంటూ సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుందీ ఈ బామ్మ. బొగ్గులపై కంకులు కాల్చేందుకు అప్పట్లోలాగా విసన కర్ర విసరడం లేదు.. సోలార్ పవర్ ఫ్యాన్ ను వాడుతోండి. ఇదేంటమ్మా అని అడిగితే… నా చేతులు కాలుతున్నాయని ఇచ్చారయ్యా అని చెబుతోంది.

ఈ సోలార్ ఫ్యాన్ ను సెల్కో సోలార్ లైట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారుచేసింది. దీనికి ఇప్పుడవుతున్న ఖర్చు రూ.9వేలు. త్వరలోనే రూ.6వేలకు తగ్గించి మార్కెట్లోకి రిలీజ్ చేయాలని అనుకుంటోంది కంపెనీ. సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ హితంగా సహజ వనరులను ఉపయోగించుకుని సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో సెల్కో కంపెనీ సోలా ప్యానెల్స్ ను రూపొందిస్తోంది. ట్రయల్ వెర్షన్ గా కొంతమందికి ఫ్రీగా ఇస్తోంది. అలా.. ఈ అవ్వ దగ్గరకు చేరింది ఈ సోలార్ ప్యానెల్.

ఫ్యాన్ లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంది. సోలార్ ప్యానెల్ దానిని నిరంతరం చార్జ్ చేస్తుంటుంది. అలా.. ఫ్యాన్ గాలికి… కంకులు కాల్చుతుంది ముసలమ్మ. దీంతో.. తన టైమ్… పొత్తు(మొక్కజొన్న కంకి)ల కోసం వచ్చేవాళ్ల టైమ్ ఆదా అవుతోందని చెబుతోంది. అవ్వ ఐడియా… ఇపుడు చాలామందిని కెవ్వుమనిపిస్తోంది.